ఎవ్వడు మలిచినవాడు?
భువికి పిలిచినవాడు
నిన్నెవ్వడు పెంచినవాడు?
పాలించి, ప్రేమించినవాడు
చెప్పించి, నొప్పించి, నేర్పించినవాడు
ఎక్కడి పాలపుంతలోనో
ఏ మూలో, ఒక చిట్టి గ్రహంలో
అణువంతలేని నీకు
ఆకాశమై రక్షణనిచ్చినవాడు
వాడెవ్వడు?
మహితాత్ముల సృష్టించి
నీకు గురువులనిచ్చిన వాడు?
బుధ్ధిని ఇచ్చి,
సిధ్ధి నీ సాధనకొదిలినవాడు?
భువికి పిలిచినవాడు
నిన్నెవ్వడు పెంచినవాడు?
పాలించి, ప్రేమించినవాడు
చెప్పించి, నొప్పించి, నేర్పించినవాడు
ఎక్కడి పాలపుంతలోనో
ఏ మూలో, ఒక చిట్టి గ్రహంలో
అణువంతలేని నీకు
ఆకాశమై రక్షణనిచ్చినవాడు
వాడెవ్వడు?
మహితాత్ముల సృష్టించి
నీకు గురువులనిచ్చిన వాడు?
బుధ్ధిని ఇచ్చి,
సిధ్ధి నీ సాధనకొదిలినవాడు?
No comments:
Post a Comment